పార్కులో ఒక పురుషుడు, ఒక స్త్రీ కూర్చుని అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్నారు. ఒకరికొకరు పరిచయం చేసుకున్నాక 'అదిగో ఆ రెడ్ షర్ట్ వేసుకున్నవాడే మా అబ్బాయీ అందామె. 'ఓహ్... యాక్తివ్గా ఉన్నాడూ అన్నాడతను. ఆ బ్లూ షర్ట్ వేసుకున్నవాడే మావాడని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ పిల్ల్లు, వారి చదువులు, పెరుగుతున్న ఫీజుల గురించి మాట్లాడుకున్నారు.
ఇంతలో అతను గడియారం వైపు చూసుకుని 'శ్యాం... టైమైపోయింది... ఇంటికి వెళ్దాం రా' అని పిలిచాడు.
'ఇంకో ఫైవ్ మినట్స్ ఆడుకుంటాను నాన్నా' అని గోముగా అదిగాడు శ్యాం. తండ్రి ఓకే చెప్పడంతో ఉత్సాహంగా ఉయ్యాల ఊగుతున్నాడు.
ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కొడుకుని పిలిచాడతను. 'ఇంకో ఐదు నిమిషాలు నాన్నా.. ఐదే ఐదు నిమిషాలూ అని బ్రతిమలాడాడు శ్యాం. తండ్రి నవ్వుతూ అంగీకరించాడు.
'మీకు చాలా ఓపికండీ' అందామె అది చూసి.
'ఓపిక కాదండీ. ఏడాది కిందట నా పెద్ద కొడుకు రాం ఇక్కడే సైకిల్ తొక్కుతుంటే ఓ తాగుబోతు డ్రైవెర్ లారీతో గుద్దేశాడు. వాడు మాకు దూరమయ్యాడు. ఆఫీస్, పని, సంపాదనంతూ అప్పట్లో నేను పిల్లలతో ఇక్కువ టైం గడపలేకపోయాను. వాళ్ళ ఆటపాటలు, ఆనందాన్ని పంచుకోలేకపోయాను. ఇప్పుడు పంచుకుందామన్నా మా రాం లేడు. అందుకే శ్యాం విషయంలో ఆ తప్పు చేయకూడది నిర్ణయించుకున్నాను. నేను ఐదు నిమిషాలు పర్మిషన్ ఇచ్చానని వాడు అనుకుంటున్నాడు. కానీ నిజానికి వాడి, ఆటను, ఆనందాన్ని చూడటానికి నాకు నేను మరో ఐదు నిమిషాలు ఇచ్చుకున్నానూ అని చెప్పాడతను.
-మనలో చాలామంది అతనిలానే వ్యవహరిస్తారు. ఆఫిస్, పని, ఫ్రెండ్స్ పేరుతో సమయమంతా గడిపేస్తూ పిల్ల దగ్గరకు వచ్చేసరికి టైం లెదని అంటుంటారు. అదేంటని అడిగితే 'ఫీజులెలా మండిపొతున్నాయో చూసారుగా.. వేలకు వేలు కడుతున్నాం. దానికోసమే కదా ఎక్కువ కష్టపడుతున్నాం' అని సమాధానమిస్తారు. కానీ పిల్లలు గొప్పగా ఎదగాలంటే కావాల్సింది కార్పొరేట్ విద్య కాదు... వారికి సమయం కేటాయించడం, వారి అభిరుచులను ప్రోత్సహించడం. అదే వారి భవిష్యత్తుకు మనం పెట్టే అతి పెద్ద పెట్టుబడి. అందుకే మా విశ్వామిత్రనే నాకు ఫస్ట్ ప్రయారిటీ... మరి మీకు?
well said i like it....:)
ReplyDelete