Thursday, May 26, 2011

జస్ట్ ఫైవ్ మినట్స్ ప్లీజ్


పార్కులో ఒక పురుషుడు, ఒక స్త్రీ కూర్చుని అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తున్నారు. ఒకరికొకరు పరిచయం చేసుకున్నాక 'అదిగో ఆ రెడ్ షర్ట్ వేసుకున్నవాడే మా అబ్బాయీ అందామె. 'ఓహ్... యాక్తివ్గా ఉన్నాడూ అన్నాడతను. ఆ బ్లూ షర్ట్ వేసుకున్నవాడే మావాడని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ పిల్ల్లు, వారి చదువులు, పెరుగుతున్న ఫీజుల గురించి మాట్లాడుకున్నారు.
ఇంతలో అతను గడియారం వైపు చూసుకుని 'శ్యాం... టైమైపోయింది... ఇంటికి వెళ్దాం రా' అని పిలిచాడు.
'ఇంకో ఫైవ్ మినట్స్ ఆడుకుంటాను నాన్నా' అని గోముగా అదిగాడు శ్యాం. తండ్రి ఓకే చెప్పడంతో ఉత్సాహంగా ఉయ్యాల ఊగుతున్నాడు.
ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కొడుకుని పిలిచాడతను. 'ఇంకో ఐదు నిమిషాలు నాన్నా.. ఐదే ఐదు నిమిషాలూ అని బ్రతిమలాడాడు శ్యాం. తండ్రి నవ్వుతూ అంగీకరించాడు.
'మీకు చాలా ఓపికండీ' అందామె అది చూసి.
'ఓపిక కాదండీ. ఏడాది కిందట నా పెద్ద కొడుకు రాం ఇక్కడే సైకిల్ తొక్కుతుంటే ఓ తాగుబోతు డ్రైవెర్ లారీతో గుద్దేశాడు. వాడు మాకు దూరమయ్యాడు. ఆఫీస్, పని, సంపాదనంతూ అప్పట్లో నేను పిల్లలతో ఇక్కువ టైం గడపలేకపోయాను. వాళ్ళ ఆటపాటలు, ఆనందాన్ని పంచుకోలేకపోయాను. ఇప్పుడు పంచుకుందామన్నా మా రాం లేడు. అందుకే శ్యాం విషయంలో ఆ తప్పు చేయకూడది నిర్ణయించుకున్నాను. నేను ఐదు నిమిషాలు పర్మిషన్ ఇచ్చానని వాడు అనుకుంటున్నాడు. కానీ నిజానికి వాడి, ఆటను, ఆనందాన్ని చూడటానికి నాకు నేను మరో ఐదు నిమిషాలు ఇచ్చుకున్నానూ అని చెప్పాడతను.

-మనలో చాలామంది అతనిలానే వ్యవహరిస్తారు. ఆఫిస్, పని, ఫ్రెండ్స్ పేరుతో సమయమంతా గడిపేస్తూ పిల్ల దగ్గరకు వచ్చేసరికి టైం లెదని అంటుంటారు. అదేంటని అడిగితే 'ఫీజులెలా మండిపొతున్నాయో చూసారుగా.. వేలకు వేలు కడుతున్నాం. దానికోసమే కదా ఎక్కువ కష్టపడుతున్నాం' అని సమాధానమిస్తారు. కానీ పిల్లలు గొప్పగా ఎదగాలంటే కావాల్సింది కార్పొరేట్ విద్య కాదు... వారికి సమయం కేటాయించడం, వారి అభిరుచులను ప్రోత్సహించడం. అదే వారి భవిష్యత్తుకు మనం పెట్టే అతి పెద్ద పెట్టుబడి. అందుకే మా విశ్వామిత్రనే నాకు ఫస్ట్ ప్రయారిటీ... మరి మీకు?

Sunday, May 8, 2011

అమ్మ ప్రేమ!

అమ్మ వంటింట్లో పని చేస్తుంటే కొడుకొచ్చి ఒక కాగితం చేతిలో పెట్టాడు. పనంతా పూర్తయ్యాక అమె దాన్ని చదివింది. అందులో ఇలా ఉంది...
తమ్ముడ్ని ఆడించినందుకు: రూ 5
రూం శుభ్రం చేసినందుకు: రూ 10
చెత్త తీసుకెళ్ళి పడేసినందుకు: రూ 5
మంచి  మార్కులు తెచ్చుకున్నందుకు: రూ 25
ఇంటి బయట క్లీన్ చేసినందుకు: రూ 10
కారు కడిగినందుకు: రూ 25
మొత్తం: రూ 80


అమ్మ దాన్ని చదివి నవ్వుకుని, కలం తీసుకుని కాగితం వెనక్కు తిప్పి ఏదో రాసి కొడుక్కి ఇచ్చింది. అందులొ ఇలా ఉంది... 
9 నెలలు మోసినందుకు: నో చార్జ్ 
పాలిచ్చి ప్రాణం పోసినందుకు: నో చార్జ్
నీ అవసరాలన్నీ తీర్చినందుకు: నో చార్జ్ 
ఎన్నో రాత్రులు నీకోసం మేలుకున్నందుకు: నో చార్జ్ 
నీకోసం, నీ అరోగ్యం కోసం ఇన్నేళ్ళుగా కార్చిన కన్నీళ్ళకు: నో చార్జ్
నీ ఆహారం, ఆరోగ్యం, తిండి, చదువు కోసం పెట్టిన ఖర్చుకు: నో చార్జ్
వీటన్నింటికీ మించి ఇన్నేళ్ళుగా నీకందించిన ప్రేమకు: నో చార్జ్
అది చదవటం పూర్తయ్యేసరికి ఆ కొడుకు కళ్ళనిండా కన్నీళ్ళు... ఒక్కసారిగా అమ్మను హత్తుకుని, అమె కళ్ళలోకి చూస్తూ "అమ్మా ఐ లవ్ యూ, ఎప్పటికీ" అని చెప్పాడు. అమ్మ పేపర్ తీసుకుని పెద్ద అక్షరాలతో ఇలా రాసింది... పెయిడ్ ఇన్ ఫుల్. 


అదీ అమ్మంటే, అమ్మ ప్రేమంటే! 
హ్యపీ మదర్స్ డే!! 

Wednesday, May 4, 2011

ప్రార్థించే చేతుల కథ

ఇక్కడ కనిపించే ప్రార్థించే చేతులను మనం చాలాసార్లు చూసి ఉంటాం. కానీ ఆ చిత్రం వెనుక ఉన్న కథ... అన్నాదమ్ముల అనుబంధానికి, త్యాగానికి అర్థం చెప్తుంది. చదివితే మీరూ నాతో ఏకీభవిస్తారు.

Back in the fifteenth century, in a tiny village near Nuremberg (Germany), lived a family with eighteen children. The father a goldsmith by profession, worked almost eighteen hours a day. Despite their seemingly hopeless condition, two of the children wanted to pursue their talent for art.
After many long discussions at night in their crowded bed, the two boys finally worked out a pact. They would toss a coin. The loser would go down into the nearby mines and, with his earnings, support his brother while he attended the art academy. Then, when that brother who won the toss completed his studies, in four years, he would support the other brother at the academy.
They tossed a coin on a Sunday morning after church. Albrecht Durer won the toss and went off to Nuremberg.
Albert went down into the dangerous mines and, for the next four years, financed his brother, whose work at the academy was almost an immediate sensation. When the young artist returned to his village, the Durer family held a festive dinner on their lawn. After a long and memorable meal, Albrecht rose to drink a toast to his beloved brother for the years of sacrifice that had enabled Albrecht to fulfill his ambition. His closing words were, "And now, Albert, blessed brother of mine, now it is your turn. Now you can go to Nuremberg to pursue your dream, and I will take care of you."
All heads turned in eager expectation to the far end of the table where Albert sat, tears streaming down his pale face, shaking his lowered head from side to side while he sobbed and repeated, over and over, "No ...no ...no ...no."
Finally, Albert rose and wiped the tears from his cheeks. He glanced down the long table at the faces he loved, and then, holding his hands close to his right cheek, he said softly, "No, brother. I cannot go to Nuremberg. It is too late for me. Look... look what four years in the mines have done to my hands! The bones in every finger have been smashed at least once, and lately I have been suffering from arthritis so badly in my right hand that I cannot even hold a glass to return your toast, much less make delicate lines on parchment or canvas with a pen or a brush. No, brother ... for me it is too late."
One day, to pay homage to Albert for all that he had sacrificed, Albrecht Durer painstakingly drew his brother's abused hands with palms together and thin fingers stretched skyward. He called his powerful drawing simply "Hands," but the entire world almost immediately opened their hearts to his great masterpiece and renamed his tribute of love "The Praying Hands."

Monday, May 2, 2011

ఒసామా తీవ్రవాది అయితే అమెరికా?

అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ మరణించాడు... అమెరికా సైన్యం కాల్పుల్లో. ప్రపంచమంతటా, ముఖ్యంగా అమెరికాలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని టీవీల్లో వార్తలు. మూడువేల మంది మరణానికి కారకుడైన లాడెన్ దోషి అయితే,  శతాబ్ద కాలంలో 122 సార్లు వివిధ దేశాలపై కుంటిసాకులతో దాడిచేసి లక్షలాదిమందిని పొట్టన పెట్టుకున్న ది గ్రేట్ అమెరికాను ఏమనాలి?


వాషింగ్టన్ లోని ది ఎవర్ గ్రీన్ స్టేట్ కాలేజ్ లో నేటివ్ అమెరికన్ స్టుదీస్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న  డాక్టర్  జోల్టాన్ గ్రాస్మాన్ ఇచ్చిన అమెరికా దాడుల లిస్ట్ చాలా పెద్దది. ఆసక్తి ఉన్నవారు నెట్లో చూడొచ్చు. శాన్ ఫ్రాన్సిస్కో లో పుట్టిన పొలిటికల్ సైంటిస్ట్  డగ్లస్ లూమిస్ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ పెరుతో అమెరికా చేస్తున్న దారుణకాండను ఎండగట్టారు. మనకు బలం ఉంది కాబట్టి ఎం చేసినా చెల్లుతుందనే అమెరికా వైఖరే లాడెన్ లాంటి వాళ్ళు పుట్టడానికి కారణమని ఆ దేశప్రజలు గుర్తిస్తే మేలు. అసలు లాడెన్ ను మొదట ఎగదోసింది తామేనని మర్చిపోతే ఎలా?


అమెరికా దాడుల లిస్ట్ లింక్ కింద ఇస్తున్నాను, ఆసక్తి ఉన్నవారు చూడొచ్చు.


http://academic.evergreen.edu/g/grossmaz/interventions.html
http://killinghope.org/superogue/bomb.htm

Thursday, April 28, 2011

మూడొంతుల జీవితం గడిచిపోయింది...


రాజా రవివర్మ, సద్దాం హుస్సేన్ లతో పాటు ఈ రోజు నేనూ పుట్టాను. ఇప్పటికి  మూడొంతుల జీవితం గడిచిపోయింది... ఎన్నో అనందాలతో, అనుభూతులతో. నేను కోరుకున్న సైకాలజీని చదవడం నా అదృష్టమైతే, ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం అతిపెద్ద విజయంగా భావిస్తాను.

ఒక పల్లెటూరిలో పుట్టిన నేను సైకాలజీ చదువుతాననగానే ఒప్పుకోవడం మా నాన్న గొప్పతనం. ఎందుకంటే అప్పటికి మా ఊర్లో ఆ పేరు విన్నవాళ్ళే తక్కువ. అలాంటి సబ్జెక్ట్ చదువుతానంటే ఒప్పుకోవడమంటే గొప్పే కదా! అదే మా నాన్న గొప్పతనం... నేనేం చదవాలో అయన ఏనాడూ నిర్ణయించలేదు. ఎంతమంది తండ్రులుంటారలా? పెళ్ళి విషయంలో కూడా నా నిర్ణయాన్ని ఒక్క మాటా అనకుండా అంగీకరించిన గొప్ప మనసాయనది. అక్షరం రాకపోయినా కష్టాల్లో కుటుంబాన్ని నడిపించిన వ్యక్తి అమ్మ. వాళ్ళు నాకు దూరమైనా వారి ప్రేమాభిమానాలు నాతోనే ఉన్నాయి, ఉంటాయి.

ఇక పెళ్ళి... మనం ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎలా పుడతామో తెలియదు. అలాగే ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణిస్తామో తెలియదు. ఈ జనన మరణల మధ్య జరిగే అతి ముఖ్యమైన ఘట్టం పెళ్ళి. అది ప్రేమించిన వ్యక్తితో జరగడం ఆనందమే కదా? ఇరువైపుల పెద్దలను ఒప్పించి జరిపించుకోవడం విజయమే కదా? నా వరకు నాకు ఇప్పటికి అదే అతి పెద్ద విజయం.

ఇక విశ్వామిత్ర... ఇప్పుడు వాడే నా ఆనందం. పేరుకు తగ్గట్టుగా మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడని ఆశిస్తున్నాను. నోబెల్ ప్రైజ్ వాడి లక్ష్యమంటున్నాడు. బ్లెస్ హిం.

జీవితం... పదో తరగతి తప్పిన వాడిని దిగ్రీ, పీజీల్లో యూనివర్సిటీ ర్యాంకులు సాధించడం ఆనందాన్నిచ్చే విషయం. జర్నలిస్టుగా సక్సెస్ఫుల్ కెరీర్, సైకాలజిస్టుగా పేరు సంపాదించుకోగలిగాను. మనిషిగా కొన్ని తప్పులు చేసినా నో రిగ్రెట్స్. జీవితమంటే తప్పొప్పుల కలయికే కదా!

ఫ్రెండ్స్... జీవితంలో అనేక కష్టాల్లో అండగా నిలబడింది నా స్నేహితులే. అప్పట్లో మా ప్రసాద్ బాబాయ్ నుంచి ఇప్పుడు గోపి వరకు... అందరూ కొండంత అండ. ఇలాంటి మిత్రులు ఇంకా ఇంకా మరింతమంది దొరుకుతారనే ఆశ. అలాగే మా తాత, మా సాంబిరెడ్డి సర్, చలం... ఈ ముగ్గురే నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో ముఖ్యులు. ఇప్పుడు నేనిలా ఉండటానికి కారకులు.

ఇక మిగిలిన ఒక భాగం జీవితం... మరింత అర్థవంతంగా కొనసాగించాలి. ఈ సంవత్సరం 'జీనియస్ ' పైన బుక్ పబ్లిష్ చేస్తాను.  పదేళ్ళ కల అది. సాకారం చేసుకుంటాను. ప్రస్తుతానికి ఆ పనిలోనే ఉన్నాను. అది పూర్తయ్యాకే మరేదైనా.

Wednesday, April 27, 2011

యే మాయ చేశావే!

ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే మనోహర దృశ్యకావ్యం... ప్రతి ఫ్రేం అందమైన కవితలా కనిపిస్తుంది. రెహమాన్ సంగీతం మనసును మురిపిస్తుంది. ముఖ్యంగా జెస్సీ తెగ నచ్చేసింది. అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాను... ఇవ్వాళ  కూడా చూశాను. ఎన్నోసారని  అడిగితే సమాధానం చెప్పలేను :-) 

Monday, April 25, 2011

ఎందుకీ ఏడుపు?


సత్యసాయిబాబా చనిపోయాడని ప్రపంచవ్యాప్తంగా వేలాది, లక్షలాది మంది భక్తులు విలపిస్తున్నారు. అందులో దేశాధినేతలనుంచి అతి సామాన్యుల వరకు అందరూ ఉన్నారు. సాయిపట్ల నా నమ్మకాలెలా ఉన్నా ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేయడంలో అయన  విజయం సాధించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే తాను ప్రారంభించిన పథకాలు తన తదనంతరం కూడా సజావుగా సాగడానికి ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారని  తెలిశాక కాస్తంత గౌరవం కలిగింది... అఫ్కోర్స్ 'గైడ్' సినిమా గుర్తొచ్చిందనుకోండి.


రాత్రంతా నిద్రలేదు... ఆలోచనలు ముసురుకుని ఊపిరాడనీయలేదు... చావుగురించి మనుషులెందుకింత బాధపడతారని... పుట్టిన ప్రతి మనిషీ మరణించక తప్పదని తెలిసినా ఎందుకు ఏడుస్తారనేది నాకు ఆశ్చర్యం. మా అమ్మ, నాన్న చనిపోయినప్పుడు కూడా ఏడుపు రాలేదంటే అది నా తప్పు కాదు... జీవించి ఉండగా మనిషి పడుతున్న బాధల్ని చూస్తే బాధ నాకు... వారికి సాయం చేయలేకపోతే బాధ... మరణించడమంటె ఈ బాధలన్నింటినుంచీ విముక్తి కదా... మరణించిన వారికే బాధలు ఉండవు కదా... మరి వారి గురించి మనం బాధ పడటం ఎందుకనేది నా ప్రశ్న. మనం ఎంత ఏడ్చినా వారు తిరిగి రారని తెలిసినా ఎందుకు ఏడవడమనేది నా ప్రశ్న.  

నాకు నచ్చిన యూజీ




ఉప్పలూరి  గోపాలకృష్ణమూర్తి మన మచిలీపట్నంలో జన్మించి ప్రపంచ దేశాలన్నీ తిరిగిన తత్వవేత్త. గురువులకు, బోధనలకు, ఉపన్యాసాలకు అయన వ్యతిరేకం. అంతిమ సత్యం అనేదేదీ లేదని, దానికోసం వెతుకులాడడం వ్యర్థమని చెప్తారు. జీవించడమే జీవికి, జీవితానికి అంతిమ లక్ష్యమంటారు. ఆయన భావాలు, ఆలోచనలు విప్లవాత్మకం... అయితే అసలు ఆలొచనలే మన శత్రువు అంటాడు యూజీ. ఆయన మాటల్లో కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. నచ్చితే మీ కామెంట్స్ రాయండి...
* That messy thing called ‘mind’ has created many destructive things. By far the most destructive of them all is God.
* The knowledge creates experience, and the experience strengthens knowledge. This is a vicious circle.
* Real silence is explosive; it is not the dead state of mind that spiritual seekers think. This is volcanic in its nature; it's bubbling all the time--the energy, the life--that is its quality.
* The Natural State is a state of great sensitivity--but this is a physical sensitivity of the senses, not some kind of emotional compassion or tenderness for others. There is compassion only in the sense that there are no 'others' for me, and so there is no separation
* All gurus are welfare organizations providing petty experiences to their followers. The guru game is a profitable industry; try and make two million dollars a year any other way.
* Whether you are interested in Moksha, Liberation, Freedom, Transformation, you name it, or you are interested in happiness without one moment of unhappiness, pleasure without pain, it is the same thing.
* Nature is interested in only two things--to survive and to reproduce one like itself. Anything you superimpose on that, all the cultural input, is responsible for the boredom of man.
* The human thinking is born out of some sort of neurological defect in the human body. Therefore anything that is born out of human thinking is destructive.
* Anything you experience based on knowledge is an illusion.
* There is no such thing as truth. The only thing that is actually there is your 'logically' ascertained premise, which you call truth.
* Only if you reject all the other paths can you discover your own path.
* Food, clothing and shelter- these are the basic needs. Beyond that, if you want anything, it is the beginning of self-deception.
* 'Be selfish and stay selfish' is my message. Wanting enlightenment is selfishness. Charity is selfishness.
* You have to be saved from the very idea that you have to be saved. You must be saved from the saviors, redeemed from the redeemers.
* When you know nothing, you say a lot. When you know something, there is nothing to say.
* All I can guarantee you is that as long as you are searching for happiness, you will remain unhappy.
* Every time a thought is born you are born. It is not this particular entity, which is non-existing even while you are living, takes a series of births.
* We don't seem to realize that it is thought that is separating us from the totality of things.
* There is no need to change this world at all; and there is no need to change yourself either.

Sunday, April 24, 2011

మరో మనిషి మరణించాడు...


భగవాన్ సత్యసాయి బాబా చనిపోయాడు... ఈ భూమ్మీద ఇప్పటివరకు చనిపోయిన కోట్లాది సామాన్యులమళ్ళే. ఆయనకోసం దేవతలు రాలేదు, ఆకాశం ఏడ్వలేదు, భూమి బద్దలు కాలేదు... ఎలాంటి ప్రత్యేక సంఘటనా జరగలేదు. చాలామందిలానే తాను కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో కన్నుమూశారు... తాను 96 సంవత్సరాలు బ్రతుకుతానన్న తన మాటను తప్పి. ఆయన కూడా మీలాంటి నాలాంటి సామాన్యుడే అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

అసలు ఒక వ్యక్తి మరణిస్తే ఎందుకింత బాధ... చావుపుటకలు సమానమని శ్రీకృష్ణుడు చెప్పింది గుర్తుకు రాదా? అసలు చావులేని మానవుడు ఇప్పటివరకు లేడనే విషయం గుర్తుకురాదా? అయినా దేవుళ్ళని నిత్యం కొలిచే రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళే మరణించగా... బాబా మరణించడంలో వింతేముంది? ఈ భూమ్మీద పుట్టిన వాళ్ళందరూ మరణించాల్సిందేనన్న చిన్న సత్యం ఎందుకు అర్ఠంకాదు? పుట్టడం ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజమన్న మౌలిక సత్యం ఎందుకు తెలియడంలేదు? చావంటే ఏమిటి... మనంలేకుండా ప్రపంచమంతా ఉండటం.... అంతేకదా?  మనం పుట్టక మునుపు ఉన్న ప్రపంచం మనం మరణించాక్కూడా ఉంటుంది, మనలాంటివాళ్ళు కోటానుకోట్లమంది మరణించాక్కూడా ఉంటుంది... అలాగే సత్యసాయి మరణించాక్కూడా. అదే సత్యం... శివం... సుందరం.

Tuesday, April 5, 2011

10 things to learn from Japan...

1. THE CALMNot a single visual of chest-beating or wild grief. Sorrow itself has been elevated.

2. THE DIGNITYDisciplined queues for water and groceries. Not a rough word or a crude gesture.

3. THE ABILITYThe incredible architects, for instance. Buildings swayed but didn’t fall.

4. THE GRACEPeople bought only what they needed for the present, so everybody could get something.

5. THE ORDERNo looting in shops. No honking and no overtaking on the roads. Just understanding.

6. THE SACRIFICEFifty workers stayed back to pump sea water in the N-reactors. How will they ever be repaid?

7. THE TENDERNESSRestaurants cut prices. An unguarded ATM is left alone. The strong cared for the weak.

8. THE TRAININGThe old and the children, everyone knew exactly what to do. And they did just that.

9. THE MEDIAThey showed magnificent restraint in the bulletins. No silly reporters. Only calm reportage.

10. THE CONSCIENCE
When the power went off in a store, people put things back on the shelves and left quietly.

Sunday, April 3, 2011

జయహో భారత్


28 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ, 121 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరాయి. జార్ఖండ్ డైనమైట్ ధోనీ సేన సమష్టిగా పోరాడి క్రికెట్ ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా పసిపిల్లవాడి నుంచి ప్రధాని వరకు అందరూ ఆసక్తిగా, ఉత్కంఠతో చూసిన  ఈ మ్యాచ్ అందరినీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా ధోనీ నాయకత్వం నన్నెంతగానో ఆకట్టుకుంది. బౌలర్లను తెలివిగా ఉపయోగించుకోవడం, బ్యాటింగ్ లో ముందుగా రావడం, ఉద్విగ్న క్షణాల్లో కూడా కూల్ గా ఉండడం... రియల్లీ వండర్ ఫుల్. నిజంగానే మిస్టర్ కూల్ అనిపించాడు.

గౌతం గంభీర్... అవసరమైన సమయంలో అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కొహ్లి, యువరాజ్ సైతం మంచి సపోర్ట్  ఇచ్చారు.

జహీర్ ఫస్ట్ స్పెల్ అద్భుతం.. 5 ఓవర్లకు 6 పరుగులిచ్చాడంటే ఎంత టైట్ గా బౌల్ చేశాడో అర్థంచేసుకోవచ్చు.

మనం ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా... సక్సెస్ స్పీక్స్ లౌడెర్ దేన్ వర్డ్స్. ఈ విజయం చాలు భారత క్రికెట్ శక్తి చాటడానికి.

ఇప్పుడు మనం... టెస్ట్, వన్ డే, 20-20 క్రికెట్ లో నంబర్ 1.

జయహో భారత్! జయ జయహో భారత్!!

Wednesday, March 30, 2011

గెలిచాం...


ఉత్కంఠభరితమైన దాయాదుల పోరులో భారత్ విజయం సాధించింది. టీం ఇండియా మొత్తం ఒక జట్టుగా ఆడి విజయం సాధించింది. బ్యాటింగ్ లో మాస్టర్ మరోసారి వెన్నెముకలా నిలవగా, చివర్లో రైనా సమయోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీంలోని ఐదుగురు బౌలర్లకు ఒక్కొక్కరికి రెండేసి వికెట్లు దక్కడం టీం స్పిరిట్ కు అద్దం పట్టింది. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తం మీద మనవాళ్ళు జట్టుగా ఆకట్టుకున్నారు. పాక్ టీంలో వాహబ్ రియాజ్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మొత్తం మీద సెమీస్ గండం గట్టెక్కడంతో  కప్పు మనదేనన్న నమ్మకం ప్రతి భారతీయుడి కళ్ళలో కనిపిస్తోంది... మాటల్లో వినిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ ఇండియా!

Tuesday, March 29, 2011

పనికిమాలిన ఫీవర్


దేశంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే ఆఫీసులన్నీ బోసిపోతాయి. ఆ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్యనైతే దేశమంతటా కర్ఫ్యూ వాతావరణమే. ఇంట్లో పనులు మానేసి, ఆఫీస్ లకు సెలవు పెట్టి మ్యాచ్ చూసేవారెందరో... నాతోసహా. కోట్లమంది పనులు మానుకుని చూసే ఈ ఆట ఆ 11మంది చేతుల్లోనే ఉంది. వారు బాగా అడితే గెలుపు, లెదంటే ఓటమి. ఈ విషయం తెలిసిన మనం చూడటం మాత్రం మానం. దీన్నే సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటారు. అంటె మనం ఏమీ చేయలేకపొయినా దాని గురించి అలోచించకుండా, మాట్లాడకుండా ఉండలేకపొవడం. క్రికెట్, పోలిటిక్స్, సినిమాలు... ఇలాంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి.
మరోటి సర్కిల్ ఆఫ్ ఇంఫ్లూయెన్స్... అంటే మనం ప్రభావితం చేయగల అంశాలు. మన చదువు, సంస్కారం, పనితీరు, ప్రవర్తన... ఇలాంటివాటిని మనం కంట్రోల్ చేయగలం.
జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకున్నవాళ్ళు, అందుకోవాలనుకునేవాళ్ళు సర్కిల్ ఆఫ్ కన్సర్న్ కన్నా సర్కిల్ ఆఫ్ ఇంఫ్లూయెన్స్ కు ఎక్కువ ఇంపార్టన్స్ ఇస్తారు.. తమ పరిధిలోని అంశాలను ప్రభావితం చేస్తారు... విజయాలు చేజిక్కించుకుంటారు. మనం మాత్రం మనం ఏ మాత్రం ప్రభావం చూపలేని క్రికెట్, పాలిటిక్స్, సినిమాల గురించి గంటలు, గంటలు మాట్లాడుకుంటూ... మనకు తోచిన విస్లేషణలతొ తుత్తి పొందుతూ... కాలాన్ని వృధా చేసుకుంటూ ఇలా మిగిలిపోతాం. యామై రైట్?

Monday, March 28, 2011

ఎవరి గోల వారిదే!



రాష్ట్రాన్ని కదిపి కుదిపేస్తున్న సమస్యేమిటో అందరికీ తెలుసు. దీని వెనకున్న రాజకీయాలు, భావోద్వేగాలు, సామాజికాంశాల గురించి ఇప్పటికే పత్రికల నిండా పేజీలకు పేజీలు రాసేశారు.. టీవీల్లో గంటల కొద్దీ మాట్లాడేశారు. వాటిలోనూ ఎవరి వాదన వారిదే. ఎందుకలా జరుగుతుందంటే ఎవరి దృష్టి వారిదే కనుక... అదేమిటో కొంచెం వివరంగా తెలుసుకుందాం.

పంచేంద్రియాల ద్వారా మనకు లభించే సమాచారం ఆధారంగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానాన్ని పర్సెప్షన్ అంటాం. అలాగే మనం ఏ స్థానంలో ఉండి అర్థం చెసుకుంటున్నాం అనేదాన్ని పర్సెప్చువల్ పొజిషన్ అంటాం. ఈ పొజిషన్స్ 5.

1వ పొజిషన్: ఒక అంశాన్ని పూర్తిగా మన కోణంలో చూడతం, అర్థంచేసుకోవడం. ఇందులో ఇతరుల మనోభావాలకు స్థానంలేదు.. నేను, నా సుఖం అనుకునే బాపతన్నమాట. ఈ స్థానాన్ని ఎక్కువగా ఉపయోగించే వ్యక్తి స్వార్థపరుడిగా కనిపిస్తాడు.

2వ పొజిషన్: ఒక అంశాన్ని ఎదుటివారి దృష్టిలో చూడటం. అంటే స్టెపింగ్   ఇన్ టూ అదర్స్ షూజ్ అన్నమాట. ఇందులో ఇతరుల మనోభావాలకే ప్రాథాన్యం. ఇందుకోసం కొంత సొంత లాభాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధమవుతాడు. అంటే  పరోపకారి పాపన్న టైప్ అన్నమాట.
 
3వ పొజిషన్: ఇది జడ్జ్ స్థానం. ఇరువర్గాల వాదనను తెలుసుకుని మాట్లాడే స్థానం. ఈ స్థానంలో ఉన్నవారికి భావోద్వేగాలు తక్కువగా ఉంటాయి లేదా ఉన్నట్టుగా కనిపిస్తారు.

4వ పొజిషన్: మొదటి, రెండో స్థానాల్లో ఎవరి గోల వారిదే. మూడో స్థానంలోవారు భావోద్వేగాలు పట్టించుకోరు. మరి సమస్యకు పరిష్కారమెలా? ఆ మూడు పొజిషన్స్ లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆ మూడు పార్టీలను ఒక టీంలా కలుపుకుని సమస్యకు పరిష్కారం అన్వేషించే, చూపించే నాయకుడి స్థానమిది. ఈ స్థానంలోని వ్యక్తి ఉమ్మడి లక్ష్యాలకు ఎక్కువ విలువిస్తాడు. వ్యవస్థ డిస్ట్రబ్ కాకుండా చూసుకుంటాడు.

5వ పొజిషన్: ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్ కు వేగంగా మారుతూ అన్ని కోణాల్లో సమస్యను అర్థం చేసుకునే యూనివర్సల్ పొజిషన్ ఇది. అందరినీ సమ దృష్టితో చూసే సెయింట్ స్థానమిది.

ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన  పరిష్కారం కనుక్కోవాలంటే ఈ 5 పొజిషన్స్ ను  ఉపయోగించుకోవాలి. కానీ మన నాయకుల్లో ఒక్కరిలోనూ ఈ సమగ్ర దృష్టి కనిపించడంలేదు. అదే సమస్యను మరింత జటిలం చేస్తోంది.

తెలంగాణ సోదరులు 1వ పొజిషన్ లో ఉండి వారి వాదనకే పరిమితమవుతున్నారు. 2వ పొజిషన్ లోకి వెళ్ళి సీమాంధ్రుల మనోభావాలను అర్థంచేసుకునే ప్రయత్నమే చేయకపోగా తమ మాటలతో చర్యలతో మరింత భయపెడుతున్నారు. రాష్ట్రం విడిపొతే హైదరాబాద్ లో తమకు రక్షణ లేదనే  వారి భయాన్ని పెంచి పోషిస్తున్నారు.

సీమాంధ్ర సోదరులదీ ఇదే తీరు. తెలంగాణ సోదరుల పోరాటాన్ని, ఆరాటాన్ని  అర్థంచేసుకోకుండా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాకుండా సీమాంధ్రులే  అడ్డుపడుతున్నారన్న భావన కలిగిస్తున్నారు.

ఈ రెండు వర్గాల, ప్రాంతాల వాదనలను విని తీర్పు చెప్పేందుకు శ్రీకృష్ణ కమిటీని నియమించారు. ఆ కమిటీ కొన్ని సూచనలు చేసింది. అందులో ఎవరికి అనుకూలంగా ఉన్నది వారు కావాలంటున్నారు. అసలు శ్రీకృష్ణ కమిటీనే అమ్ముడుపోయిందంటున్నారు తెలంగాణ సోదరులు. దీంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది.

4వ పొజిషన్ లో నిలిచి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం, అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సమస్యను రాజకీయ దృష్టితోనే చూస్తోంది. తెలంగాణ ఇస్తే లాభమేంటి, ఇవ్వకపోతే నష్టమేంటి అనే కోణంలోనే అలోచిస్తోంది. దీంతో సమస్య మరింత జటిలమవుతోంది. వైషమ్యాలు, విద్వేషాలు మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కావాల్సింది సమదృష్టి. ప్రాంతీయ దురభిమానాలకు దూరంగా, రాజకీయాలకు అతీతంగా, ఓట్లు పోతాయనే భయంలేకుండా, అందరిని కలుపుకుని సమస్యకు పరిష్కారం అన్వేషించే స్థితప్రజ్ఞత. మన మహానేతల్లో మచ్చుకు ఒక్కరిలోనైనా ఆ లక్షణం కనిపించకపోవడం మన దౌర్భాగ్యం. మరి ఈ సమస్యకు పరిష్కారమేమిటంటారా... కాలం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. కాదంటారా?

Saturday, March 26, 2011

మనం చూసేది వాస్తవమేనా?

మనం జీవితంలో నిత్యం అనేక విషయాలను చూస్తుంటాం. మనం చూసిందే వాస్తవమని నమ్ముతుంటాం. నిజంగా మనం చూసేది వాస్తవమేనా అని ఏనాడూ ప్రశ్ర్నించుకోం. నిజానికి ఈ ప్రపంచంలో ఒక వస్తువును ఏ ఇద్దరూ ఒకేలా చూడలేరు,ఒక అంశాన్ని ఏ ఇద్దరూ ఒకేలా అర్థంచేసుకోలేరు. మనం పుట్టి పెరిగిన ప్రాంతం, పరిస్థితులు, చదువు, సంస్కౄతి, తదితరాలన్నీ మన మైండ్ సెట్ ని ప్రభావితం చేస్తాయి. దాన్నిబట్టే మనం ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం, ప్రవర్తిస్తాం. అలాంటప్పుడు నేను నమ్మిందే రైట్, నేను నమ్మిన సిద్దంతమే కరెక్ట్ అనుకోవడంలో అర్థం ఏమైనా ఉందంటారా? నేనైతే ఖచ్చితంగా లేదనే అంటాను. ఏకం సత్యం, విప్రః బహుధా వదంతి అని భారతీయ తత్వం చెప్పినా, మ్యాప్ ఈజ్ నాట్ ది టెరిటరీ అని ఎన్ ఎల్ పి లో చెప్పినా అర్థమిదే. అందుకేనేమో శంకరాచార్యుడు ఈ ప్రపంచమంతా మాయ అన్నాడు. లోతుగా అలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది. కానీ బ్రతికినంత కాలం ఆ మాయ నిజమేనని నమ్మాల్సి రావడమే జీవన వైచిత్రి. 

మీ విశేష్

ఇది నా కొత్త బ్లాగ్. రోజూ ఇక్కడ కలుసుకుని మాట్లాడుకుందాం