Thursday, April 28, 2011

మూడొంతుల జీవితం గడిచిపోయింది...


రాజా రవివర్మ, సద్దాం హుస్సేన్ లతో పాటు ఈ రోజు నేనూ పుట్టాను. ఇప్పటికి  మూడొంతుల జీవితం గడిచిపోయింది... ఎన్నో అనందాలతో, అనుభూతులతో. నేను కోరుకున్న సైకాలజీని చదవడం నా అదృష్టమైతే, ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం అతిపెద్ద విజయంగా భావిస్తాను.

ఒక పల్లెటూరిలో పుట్టిన నేను సైకాలజీ చదువుతాననగానే ఒప్పుకోవడం మా నాన్న గొప్పతనం. ఎందుకంటే అప్పటికి మా ఊర్లో ఆ పేరు విన్నవాళ్ళే తక్కువ. అలాంటి సబ్జెక్ట్ చదువుతానంటే ఒప్పుకోవడమంటే గొప్పే కదా! అదే మా నాన్న గొప్పతనం... నేనేం చదవాలో అయన ఏనాడూ నిర్ణయించలేదు. ఎంతమంది తండ్రులుంటారలా? పెళ్ళి విషయంలో కూడా నా నిర్ణయాన్ని ఒక్క మాటా అనకుండా అంగీకరించిన గొప్ప మనసాయనది. అక్షరం రాకపోయినా కష్టాల్లో కుటుంబాన్ని నడిపించిన వ్యక్తి అమ్మ. వాళ్ళు నాకు దూరమైనా వారి ప్రేమాభిమానాలు నాతోనే ఉన్నాయి, ఉంటాయి.

ఇక పెళ్ళి... మనం ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎలా పుడతామో తెలియదు. అలాగే ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణిస్తామో తెలియదు. ఈ జనన మరణల మధ్య జరిగే అతి ముఖ్యమైన ఘట్టం పెళ్ళి. అది ప్రేమించిన వ్యక్తితో జరగడం ఆనందమే కదా? ఇరువైపుల పెద్దలను ఒప్పించి జరిపించుకోవడం విజయమే కదా? నా వరకు నాకు ఇప్పటికి అదే అతి పెద్ద విజయం.

ఇక విశ్వామిత్ర... ఇప్పుడు వాడే నా ఆనందం. పేరుకు తగ్గట్టుగా మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడని ఆశిస్తున్నాను. నోబెల్ ప్రైజ్ వాడి లక్ష్యమంటున్నాడు. బ్లెస్ హిం.

జీవితం... పదో తరగతి తప్పిన వాడిని దిగ్రీ, పీజీల్లో యూనివర్సిటీ ర్యాంకులు సాధించడం ఆనందాన్నిచ్చే విషయం. జర్నలిస్టుగా సక్సెస్ఫుల్ కెరీర్, సైకాలజిస్టుగా పేరు సంపాదించుకోగలిగాను. మనిషిగా కొన్ని తప్పులు చేసినా నో రిగ్రెట్స్. జీవితమంటే తప్పొప్పుల కలయికే కదా!

ఫ్రెండ్స్... జీవితంలో అనేక కష్టాల్లో అండగా నిలబడింది నా స్నేహితులే. అప్పట్లో మా ప్రసాద్ బాబాయ్ నుంచి ఇప్పుడు గోపి వరకు... అందరూ కొండంత అండ. ఇలాంటి మిత్రులు ఇంకా ఇంకా మరింతమంది దొరుకుతారనే ఆశ. అలాగే మా తాత, మా సాంబిరెడ్డి సర్, చలం... ఈ ముగ్గురే నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో ముఖ్యులు. ఇప్పుడు నేనిలా ఉండటానికి కారకులు.

ఇక మిగిలిన ఒక భాగం జీవితం... మరింత అర్థవంతంగా కొనసాగించాలి. ఈ సంవత్సరం 'జీనియస్ ' పైన బుక్ పబ్లిష్ చేస్తాను.  పదేళ్ళ కల అది. సాకారం చేసుకుంటాను. ప్రస్తుతానికి ఆ పనిలోనే ఉన్నాను. అది పూర్తయ్యాకే మరేదైనా.

Wednesday, April 27, 2011

యే మాయ చేశావే!

ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే మనోహర దృశ్యకావ్యం... ప్రతి ఫ్రేం అందమైన కవితలా కనిపిస్తుంది. రెహమాన్ సంగీతం మనసును మురిపిస్తుంది. ముఖ్యంగా జెస్సీ తెగ నచ్చేసింది. అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉన్నాను... ఇవ్వాళ  కూడా చూశాను. ఎన్నోసారని  అడిగితే సమాధానం చెప్పలేను :-) 

Monday, April 25, 2011

ఎందుకీ ఏడుపు?


సత్యసాయిబాబా చనిపోయాడని ప్రపంచవ్యాప్తంగా వేలాది, లక్షలాది మంది భక్తులు విలపిస్తున్నారు. అందులో దేశాధినేతలనుంచి అతి సామాన్యుల వరకు అందరూ ఉన్నారు. సాయిపట్ల నా నమ్మకాలెలా ఉన్నా ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేయడంలో అయన  విజయం సాధించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే తాను ప్రారంభించిన పథకాలు తన తదనంతరం కూడా సజావుగా సాగడానికి ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారని  తెలిశాక కాస్తంత గౌరవం కలిగింది... అఫ్కోర్స్ 'గైడ్' సినిమా గుర్తొచ్చిందనుకోండి.


రాత్రంతా నిద్రలేదు... ఆలోచనలు ముసురుకుని ఊపిరాడనీయలేదు... చావుగురించి మనుషులెందుకింత బాధపడతారని... పుట్టిన ప్రతి మనిషీ మరణించక తప్పదని తెలిసినా ఎందుకు ఏడుస్తారనేది నాకు ఆశ్చర్యం. మా అమ్మ, నాన్న చనిపోయినప్పుడు కూడా ఏడుపు రాలేదంటే అది నా తప్పు కాదు... జీవించి ఉండగా మనిషి పడుతున్న బాధల్ని చూస్తే బాధ నాకు... వారికి సాయం చేయలేకపోతే బాధ... మరణించడమంటె ఈ బాధలన్నింటినుంచీ విముక్తి కదా... మరణించిన వారికే బాధలు ఉండవు కదా... మరి వారి గురించి మనం బాధ పడటం ఎందుకనేది నా ప్రశ్న. మనం ఎంత ఏడ్చినా వారు తిరిగి రారని తెలిసినా ఎందుకు ఏడవడమనేది నా ప్రశ్న.  

నాకు నచ్చిన యూజీ




ఉప్పలూరి  గోపాలకృష్ణమూర్తి మన మచిలీపట్నంలో జన్మించి ప్రపంచ దేశాలన్నీ తిరిగిన తత్వవేత్త. గురువులకు, బోధనలకు, ఉపన్యాసాలకు అయన వ్యతిరేకం. అంతిమ సత్యం అనేదేదీ లేదని, దానికోసం వెతుకులాడడం వ్యర్థమని చెప్తారు. జీవించడమే జీవికి, జీవితానికి అంతిమ లక్ష్యమంటారు. ఆయన భావాలు, ఆలోచనలు విప్లవాత్మకం... అయితే అసలు ఆలొచనలే మన శత్రువు అంటాడు యూజీ. ఆయన మాటల్లో కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. నచ్చితే మీ కామెంట్స్ రాయండి...
* That messy thing called ‘mind’ has created many destructive things. By far the most destructive of them all is God.
* The knowledge creates experience, and the experience strengthens knowledge. This is a vicious circle.
* Real silence is explosive; it is not the dead state of mind that spiritual seekers think. This is volcanic in its nature; it's bubbling all the time--the energy, the life--that is its quality.
* The Natural State is a state of great sensitivity--but this is a physical sensitivity of the senses, not some kind of emotional compassion or tenderness for others. There is compassion only in the sense that there are no 'others' for me, and so there is no separation
* All gurus are welfare organizations providing petty experiences to their followers. The guru game is a profitable industry; try and make two million dollars a year any other way.
* Whether you are interested in Moksha, Liberation, Freedom, Transformation, you name it, or you are interested in happiness without one moment of unhappiness, pleasure without pain, it is the same thing.
* Nature is interested in only two things--to survive and to reproduce one like itself. Anything you superimpose on that, all the cultural input, is responsible for the boredom of man.
* The human thinking is born out of some sort of neurological defect in the human body. Therefore anything that is born out of human thinking is destructive.
* Anything you experience based on knowledge is an illusion.
* There is no such thing as truth. The only thing that is actually there is your 'logically' ascertained premise, which you call truth.
* Only if you reject all the other paths can you discover your own path.
* Food, clothing and shelter- these are the basic needs. Beyond that, if you want anything, it is the beginning of self-deception.
* 'Be selfish and stay selfish' is my message. Wanting enlightenment is selfishness. Charity is selfishness.
* You have to be saved from the very idea that you have to be saved. You must be saved from the saviors, redeemed from the redeemers.
* When you know nothing, you say a lot. When you know something, there is nothing to say.
* All I can guarantee you is that as long as you are searching for happiness, you will remain unhappy.
* Every time a thought is born you are born. It is not this particular entity, which is non-existing even while you are living, takes a series of births.
* We don't seem to realize that it is thought that is separating us from the totality of things.
* There is no need to change this world at all; and there is no need to change yourself either.

Sunday, April 24, 2011

మరో మనిషి మరణించాడు...


భగవాన్ సత్యసాయి బాబా చనిపోయాడు... ఈ భూమ్మీద ఇప్పటివరకు చనిపోయిన కోట్లాది సామాన్యులమళ్ళే. ఆయనకోసం దేవతలు రాలేదు, ఆకాశం ఏడ్వలేదు, భూమి బద్దలు కాలేదు... ఎలాంటి ప్రత్యేక సంఘటనా జరగలేదు. చాలామందిలానే తాను కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో కన్నుమూశారు... తాను 96 సంవత్సరాలు బ్రతుకుతానన్న తన మాటను తప్పి. ఆయన కూడా మీలాంటి నాలాంటి సామాన్యుడే అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

అసలు ఒక వ్యక్తి మరణిస్తే ఎందుకింత బాధ... చావుపుటకలు సమానమని శ్రీకృష్ణుడు చెప్పింది గుర్తుకు రాదా? అసలు చావులేని మానవుడు ఇప్పటివరకు లేడనే విషయం గుర్తుకురాదా? అయినా దేవుళ్ళని నిత్యం కొలిచే రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళే మరణించగా... బాబా మరణించడంలో వింతేముంది? ఈ భూమ్మీద పుట్టిన వాళ్ళందరూ మరణించాల్సిందేనన్న చిన్న సత్యం ఎందుకు అర్ఠంకాదు? పుట్టడం ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజమన్న మౌలిక సత్యం ఎందుకు తెలియడంలేదు? చావంటే ఏమిటి... మనంలేకుండా ప్రపంచమంతా ఉండటం.... అంతేకదా?  మనం పుట్టక మునుపు ఉన్న ప్రపంచం మనం మరణించాక్కూడా ఉంటుంది, మనలాంటివాళ్ళు కోటానుకోట్లమంది మరణించాక్కూడా ఉంటుంది... అలాగే సత్యసాయి మరణించాక్కూడా. అదే సత్యం... శివం... సుందరం.

Tuesday, April 5, 2011

10 things to learn from Japan...

1. THE CALMNot a single visual of chest-beating or wild grief. Sorrow itself has been elevated.

2. THE DIGNITYDisciplined queues for water and groceries. Not a rough word or a crude gesture.

3. THE ABILITYThe incredible architects, for instance. Buildings swayed but didn’t fall.

4. THE GRACEPeople bought only what they needed for the present, so everybody could get something.

5. THE ORDERNo looting in shops. No honking and no overtaking on the roads. Just understanding.

6. THE SACRIFICEFifty workers stayed back to pump sea water in the N-reactors. How will they ever be repaid?

7. THE TENDERNESSRestaurants cut prices. An unguarded ATM is left alone. The strong cared for the weak.

8. THE TRAININGThe old and the children, everyone knew exactly what to do. And they did just that.

9. THE MEDIAThey showed magnificent restraint in the bulletins. No silly reporters. Only calm reportage.

10. THE CONSCIENCE
When the power went off in a store, people put things back on the shelves and left quietly.

Sunday, April 3, 2011

జయహో భారత్


28 ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ, 121 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరాయి. జార్ఖండ్ డైనమైట్ ధోనీ సేన సమష్టిగా పోరాడి క్రికెట్ ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా పసిపిల్లవాడి నుంచి ప్రధాని వరకు అందరూ ఆసక్తిగా, ఉత్కంఠతో చూసిన  ఈ మ్యాచ్ అందరినీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా ధోనీ నాయకత్వం నన్నెంతగానో ఆకట్టుకుంది. బౌలర్లను తెలివిగా ఉపయోగించుకోవడం, బ్యాటింగ్ లో ముందుగా రావడం, ఉద్విగ్న క్షణాల్లో కూడా కూల్ గా ఉండడం... రియల్లీ వండర్ ఫుల్. నిజంగానే మిస్టర్ కూల్ అనిపించాడు.

గౌతం గంభీర్... అవసరమైన సమయంలో అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కొహ్లి, యువరాజ్ సైతం మంచి సపోర్ట్  ఇచ్చారు.

జహీర్ ఫస్ట్ స్పెల్ అద్భుతం.. 5 ఓవర్లకు 6 పరుగులిచ్చాడంటే ఎంత టైట్ గా బౌల్ చేశాడో అర్థంచేసుకోవచ్చు.

మనం ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా... సక్సెస్ స్పీక్స్ లౌడెర్ దేన్ వర్డ్స్. ఈ విజయం చాలు భారత క్రికెట్ శక్తి చాటడానికి.

ఇప్పుడు మనం... టెస్ట్, వన్ డే, 20-20 క్రికెట్ లో నంబర్ 1.

జయహో భారత్! జయ జయహో భారత్!!