ఉత్కంఠభరితమైన దాయాదుల పోరులో భారత్ విజయం సాధించింది. టీం ఇండియా మొత్తం ఒక జట్టుగా ఆడి విజయం సాధించింది. బ్యాటింగ్ లో మాస్టర్ మరోసారి వెన్నెముకలా నిలవగా, చివర్లో రైనా సమయోచితమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీంలోని ఐదుగురు బౌలర్లకు ఒక్కొక్కరికి రెండేసి వికెట్లు దక్కడం టీం స్పిరిట్ కు అద్దం పట్టింది. ఫీల్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తం మీద మనవాళ్ళు జట్టుగా ఆకట్టుకున్నారు. పాక్ టీంలో వాహబ్ రియాజ్ ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మొత్తం మీద సెమీస్ గండం గట్టెక్కడంతో కప్పు మనదేనన్న నమ్మకం ప్రతి భారతీయుడి కళ్ళలో కనిపిస్తోంది... మాటల్లో వినిపిస్తోంది. ఆల్ ది బెస్ట్ ఇండియా!
No comments:
Post a Comment