సత్యసాయిబాబా చనిపోయాడని ప్రపంచవ్యాప్తంగా వేలాది, లక్షలాది మంది భక్తులు విలపిస్తున్నారు. అందులో దేశాధినేతలనుంచి అతి సామాన్యుల వరకు అందరూ ఉన్నారు. సాయిపట్ల నా నమ్మకాలెలా ఉన్నా ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేయడంలో అయన విజయం సాధించారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే తాను ప్రారంభించిన పథకాలు తన తదనంతరం కూడా సజావుగా సాగడానికి ఫిక్స్ డ్ డిపాజిట్లు చేశారని తెలిశాక కాస్తంత గౌరవం కలిగింది... అఫ్కోర్స్ 'గైడ్' సినిమా గుర్తొచ్చిందనుకోండి.
రాత్రంతా నిద్రలేదు... ఆలోచనలు ముసురుకుని ఊపిరాడనీయలేదు... చావుగురించి మనుషులెందుకింత బాధపడతారని... పుట్టిన ప్రతి మనిషీ మరణించక తప్పదని తెలిసినా ఎందుకు ఏడుస్తారనేది నాకు ఆశ్చర్యం. మా అమ్మ, నాన్న చనిపోయినప్పుడు కూడా ఏడుపు రాలేదంటే అది నా తప్పు కాదు... జీవించి ఉండగా మనిషి పడుతున్న బాధల్ని చూస్తే బాధ నాకు... వారికి సాయం చేయలేకపోతే బాధ... మరణించడమంటె ఈ బాధలన్నింటినుంచీ విముక్తి కదా... మరణించిన వారికే బాధలు ఉండవు కదా... మరి వారి గురించి మనం బాధ పడటం ఎందుకనేది నా ప్రశ్న. మనం ఎంత ఏడ్చినా వారు తిరిగి రారని తెలిసినా ఎందుకు ఏడవడమనేది నా ప్రశ్న.
No comments:
Post a Comment