Sunday, April 24, 2011

మరో మనిషి మరణించాడు...


భగవాన్ సత్యసాయి బాబా చనిపోయాడు... ఈ భూమ్మీద ఇప్పటివరకు చనిపోయిన కోట్లాది సామాన్యులమళ్ళే. ఆయనకోసం దేవతలు రాలేదు, ఆకాశం ఏడ్వలేదు, భూమి బద్దలు కాలేదు... ఎలాంటి ప్రత్యేక సంఘటనా జరగలేదు. చాలామందిలానే తాను కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో కన్నుమూశారు... తాను 96 సంవత్సరాలు బ్రతుకుతానన్న తన మాటను తప్పి. ఆయన కూడా మీలాంటి నాలాంటి సామాన్యుడే అనడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

అసలు ఒక వ్యక్తి మరణిస్తే ఎందుకింత బాధ... చావుపుటకలు సమానమని శ్రీకృష్ణుడు చెప్పింది గుర్తుకు రాదా? అసలు చావులేని మానవుడు ఇప్పటివరకు లేడనే విషయం గుర్తుకురాదా? అయినా దేవుళ్ళని నిత్యం కొలిచే రాముడు, కృష్ణుడు లాంటి వాళ్ళే మరణించగా... బాబా మరణించడంలో వింతేముంది? ఈ భూమ్మీద పుట్టిన వాళ్ళందరూ మరణించాల్సిందేనన్న చిన్న సత్యం ఎందుకు అర్ఠంకాదు? పుట్టడం ఎంత సహజమో మరణించడం కూడా అంతే సహజమన్న మౌలిక సత్యం ఎందుకు తెలియడంలేదు? చావంటే ఏమిటి... మనంలేకుండా ప్రపంచమంతా ఉండటం.... అంతేకదా?  మనం పుట్టక మునుపు ఉన్న ప్రపంచం మనం మరణించాక్కూడా ఉంటుంది, మనలాంటివాళ్ళు కోటానుకోట్లమంది మరణించాక్కూడా ఉంటుంది... అలాగే సత్యసాయి మరణించాక్కూడా. అదే సత్యం... శివం... సుందరం.

No comments:

Post a Comment